ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న వాళ్లలో కుషిత కల్లపు( Kushitha Kallapu ) ఒకరు.బజ్జీ పాపగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుషితకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
నేను లిప్ కిస్ అయితే పెట్టనని ఇంటిమేట్ సీన్స్( Intimate Scenes ) కొంతవరకు అయితే ఓకే అని ఆమె కామెంట్లు చేశారు.లిప్ టూ లిప్ కిస్ సీన్స్ లో మాత్రం తాను చేయనని కుషిత క్లారిటీ ఇచ్చేశారు.
మరీ బోల్డ్ సీన్స్ లో అయితే చేయనని ఆమె పరోక్షంగా చెప్పేశారు.
అలాంటి సీన్లలో చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరని ఆమె తెలిపారు.
నాకు కూడా అలాంటి సీన్లలో నటించడం నచ్చదని ఆమె వెల్లడించారు.భవిష్యత్తులో నాకు పెళ్లవుతుందని మొదటి ముద్దు( First Kiss ) నా భర్తకే అని కుషిత అన్నారు.
మొదటి ముద్దు నా మొగుడికే అనుకుంటిని అంటూ సరదాగా కామెంట్లు చేశారు.మా అత్తయ్య ఎలా ఉన్నారంటూ కొంతమంది కామెంట్లు చేస్తారని ఆమె తెలిపారు.
బుజ్జి, బంగారం అంటూ కొంతమంది సరదాగా అన్నారు.నా చదువు గురించి మాత్రం నేను అస్సలు చెప్పనని కుషిత అన్నారు.2002లో నేను పుట్టానని ఆమె వెల్లడించారు.అదే ఇంటర్వ్యూలో అర్జున్ కళ్యాణ్( Arjun Kalyan ) పాల్గొనగా శ్రీ సత్యతో( Sri Sathya ) ఇప్పుడు పెద్దగా కాంటాక్ట్ లో లేనని నెలకు ఒకసారి మాత్రమే మాట్లాడతానని ఆయన వెల్లడించారు.
మనం ఎక్కువ ప్రేమను చూపించకూడదని ఆయన అన్నారు.
కుషిత కల్లపు పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.ఆమె సోదరి ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.పోలీసులకు ఆమె సోదరి ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ కూడా తప్పు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
కుషిత కల్లపు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.