ఏపీలో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం..: సీఎం జగన్

ఏపీలో మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని సీఎం జగన్( CM YS Jagan ) అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఓ వైపు తాను, మరోవైపు కౌరవ సైన్యం ఉందని తెలిపారు.

ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో పేదల భవిష్యత్ ను నిర్ణయించేవని సీఎం జగన్ పేర్కొన్నారు.చంద్రబాబు( Chandrababu )కు మద్ధతుగా మరో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయన్న ఆయన తాను ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని తెలిపారు.

ప్రజలతోనే తన పొత్తు అని చెప్పారు.అందరిని మోసం చేసిన చరిత్ర కూటమిదని విమర్శించారు.

ప్రతి ఇంటికి మంచి చేసిన ఒకే ఒక్కడు మీ బిడ్డ అని చెప్పారు.ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటు వేయడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేనన్నారు.

Advertisement

చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని తెలిపారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు