వారంలో మూడు రోజులు కూలిపని.. టెన్త్ లో 509 మార్కులు.. విద్యార్థిని సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన విద్యార్థిని మనస్వి 600కు 599 మార్కులు సాధించడం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు మార్కుల విషయంలో మనస్వి మార్కులు స్టేట్ రికార్డ్ అనే చెప్పాలి.

ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం కూడా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఒక విద్యార్థిని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని( Kurnool District ) చిప్పగిరి మండలం బంటనహాల్ కు చెందిన నవీన( Naveena ) అనే విద్యార్థిని వారంలో మూడురోజులు కూలి పని చేస్తూ పది పరీక్షలలో 509 మార్కులు సాధించడం గమనార్హం.చిప్పగిరి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల మార్కులు పరిశీలిస్తే నవీన సాధించిన మార్కులే హైయెస్ట్ కావడం గమనార్హం.

కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక వారంలో మూడు రోజులు పనికి వెళ్లాల్సి వస్తోందని నవీన చెబుతున్నారు.

Advertisement

నవీన తల్లి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుండగా తండ్రి కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.నవీన సక్సెస్ స్టోరీ( Naveena Success Story ) ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.నవీన కూలిపనికి వెళ్లకుండా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవీన చదువుకునే అవకాశం ఉంటుంది.

ఇలాంటి విద్యార్థులకు రాజకీయ నేతల సపోర్ట్ ఉంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.పది పరీక్షలో( Tenth Exams ) మంచి మార్కులు సాధించిన నవీనను నెటిజన్లు అభినందిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయిలో మార్కులు సాధించడం సులువు కాదని నెటిజన్లు చెబుతున్నారు.

నవీన లాంటి మట్టిలో మాణిక్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయసహకారాలు అందితే వాళ్లు భవిష్యత్తులో అద్భుతాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు