“బీమ్లా నాయక్” రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.కాగా నిన్ననే హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ క్రమంలో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.పవన్ కళ్యాణ్ క్రేజ్ అదేవిధంగా తన కాలేజ్ డేస్ లో పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” చూడటం జరిగిందని.
చెప్పారు.సినిమా ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్లు.
పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా గాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విలక్షణం వేరు అని కొనియాడారు.
కొన్ని సంవత్సరాల పాటు స్టార్ డాం ఉన్న కొద్ది పెంచుకోవటం అనేది.
మాములు విషయం కాదు అది ఒక పవన్ కళ్యాణ్ కే చెందుతుందని స్పష్టం చేశారు.అయితే తాజాగా మరోసారి ఈ ఈవెంట్ గురించి కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు.
తన సోదరులు పవన్ కళ్యాణ్, రానా, తమన్, సాగర్ చంద్ర లకి “బీమ్లా నాయక్” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి.రొటీన్ నుండి కొంత విరామం తీసుకున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా మొగులయ్య, శివమణి వంటి గ్రేట్ సంగీత విద్వాంసులను కలవటం చాలా సంతోషాన్ని కలిగించిందని కేటీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.