తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ( Minister Konda Surekha )బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) లీగల్ నోటీసులు పంపారు.మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో( MLA Yennam Srinivas Reddy ) పాటు కేకే మహేందర్ రెడ్డికి ఆయన నోటీసులు పంపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులు అందించారు.ఈ క్రమంలో వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
తప్పుడు ప్రచారాలు చేసే వారు సీఎం అయినా సరే వదిలిపెట్టమని స్పష్టం చేశారు.చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపారు.