ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ అంటే వింతగా చూసేవారు.కనీసం వారికి మర్యాద కూడా ఇచ్చేవారు కాదు.
సినిమాలలోకి వెళ్లారు అంటే చెడిపోతారు అని వారు భావించేవారు.సినిమాలలోకి వేరే వారికి మర్యాద ఉండదని భావించేవారు.
ఆ తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి నిజానిజాలు తెలియడంతో కొంతమంది అభిప్రాయం మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది హీరోయిన్ల విషయంలో ఎన్నో అపోహలు రూమర్లను సృష్టిస్తూ ఉండడంతో వాటిని చాలామంది నిజమని నమ్ముతున్నారు.టెక్నాలజీ డెవలప్ అయి కొత్త పుంతలు తొక్కుతున్న కూడా ఇప్పటికీ హీరోయిన్ అంటే కొంతమంది ఒక రకమైన చూపు ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు.

అంతేకాకుండా హీరోయిన్లకు సరిగా పెళ్లిళ్లు నిశ్చితార్థాలు కావని అందుకే హీరోయిన్లు పెళ్లి వయసు దాటి పోయినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారని చాలామంది అభిప్రాయం పడుతూ ఉంటారు.ఇది అవని నిజం కాదని పెళ్లి కెరియర్ విషయంలో హీరోయిన్స్ పడే కష్టాలు వేరే ఉంటాయి అంటోంది మన స్టార్ హీరోయిన్ కృతి సనన్.కృతి సనన్ గురించి మనందరికీ తెలిసిందే.మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి పరిమితం అయిపోయింది.
అలా అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది కృతీసనన్.ఇకపోతే కృతిసనన్ ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి త్వరగా పెళ్లిళ్లు కావనే అభిప్రాయం ఎప్పటి నుంచో చాలామందిలో ఉంది.హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.
యాక్టింగ్ అనేది ఓ హీరోయిన్ లైఫ్ లో ఓ భాగమనే విషయాన్నీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.అందుకే హీరోయిన్స్ కి పెళ్లి కావడం కష్టం.
నా కెరీర్ ప్రారంభంలో చాలామంది ఈ విషయంపై కంగారు పెట్టే ప్రయత్నం చేశారు.కానీ నేను వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.
ఆ విధంగా ముందడుగు వేశాను కాబట్టే నేను కోరుకున్న వృత్తిలో రాణిస్తున్నాను అని చెప్పుకొచ్చింది కృతిసనన్.