యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ( Krithi Shetty ) ఉప్పెన సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.అలా ఈమె చేసిన మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి.
కానీ ఆ తర్వాత ఈమె బ్యాడ్ లక్ ఏంటో గాని ఈమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ అవడంతో అప్పుడే వచ్చిన శ్రీలీల ( Sreeleela ) కి వరుస అవకాశాలు ఇస్తూ కృతి శెట్టిని పక్కన పెట్టారు.ఇక అడపా దడపా కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమెకు ముందు ఉన్నంత ఇమేజ్ మాత్రం లేదని చెప్పుకోవచ్చు.
ఇక ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో రెండు సినిమాలు అలాగే తెలుగులో ఒక సినిమాలో చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తే నిన్ను ఇంటికి కూడా రానివ్వను అని కృతి శెట్టి ఆమె తల్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.
మరి ఇంతకీ ఎవరితో నటించకూడదు అని కృతిశెట్టికి ఆమె తల్లి వార్నింగ్ ఇచ్చింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ ( Sharwanand ) తో ఓ సినిమా చేస్తుంది.

అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలో కృతి శెట్టి కి హీరోయిన్ గా అవకాశం వచ్చింది అంటూ టాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కృతి శెట్టి తల్లి మాత్రం చిరంజీవి ( Chiranjeevi ) తో కలిసి నువ్వు హీరోయిన్ గా చేస్తే ఇంటికి కూడా రానివ్వను అని వార్నింగ్ ఇచ్చిందట.అయితే అంత పెద్దస్టార్ హీరోతో సినిమా ఆఫర్ వస్తే కృతి శెట్టి తల్లి ఎందుకు చేయకని చెప్పింది అంటే కృతి శెట్టి తల్లి మెగాస్టార్ చిరంజీవికి చాలా పెద్ద వీరాభిమానట.

ఈ కారణంతోనే తనకి ఎంతో ఇష్టమైన హీరోతో తన కూతురు రొమాన్స్ చేస్తే బాగుండదని,అందుకే చిరంజీవితో అవకాశం వచ్చినా కూడా రిజెక్ట్ చేయమని చెప్పిందట.ఒకవేళ తన మాట కాదని చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా చేస్తే మాత్రం ఇంటి గడప కూడా తొక్కనీయనని వార్నింగ్ ఇచ్చిందట.కానీ ఆయన సినిమాల్లో చెల్లిగా లేదా కూతురుగా అవకాశం వస్తే మాత్రం చేయమని చెప్పిందట.
ప్రస్తుతం ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.







