పర్సనల్ గా నేను రౌడీనే.. వైరల్ అవుతున్న కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు!

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి( Krithi Shetty ) ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో యావరేజ్ హిట్లను సొంతం చేసుకున్నారు.

ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో కృతిశెట్టికి భారీ షాకులు తగిలాయి.

కస్టడీ సినిమాతో తనకు సక్సెస్ భావిస్తున్న కృతి ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి మాట్లాడుతూ కస్టడీ మూవీ( Custody Movie )లో హీరో విలన్ ను కాపాడటానికి ప్రయత్నిస్తాడని తెలిపారు.కథ సీరియస్ అవుతున్న సమయంలో నా రోల్ బ్యాలెన్స్ చేస్తుందని కృతి కామెంట్లు చేశారు.నా రోల్ నిడివి కూడా ఎక్కువని కస్టడీ మూవీ కొరకు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశానని కృతిశెట్టి చెప్పుకొచ్చారు.

నా పాత్రలో మంచి ఎమోషన్ ఉంటుందని కృతిశెట్టి వెల్లడించడం గమనార్హం.

Advertisement

ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్( Under water Sequence ) ఉంటుందని 15 రోజుల పాటు ఆ సీక్వెన్స్ షూట్ జరిగిందని కృతి అన్నారు.రెండు రోజులు శిక్షణ తీసుకుని ఆ సీన్ షూట్ లో పాల్గొన్నమని కృతి తెలిపారు.నాగచైతన్య నిజాయితీగా ఉంటాడని చైతన్యతో కంఫర్టబుల్ గా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.

కస్టడీ సెట్స్ లో నేను రౌడీలా ఉన్నానని దర్శకుడు అన్నారని పర్సనల్ గా కూడా నేను రౌడీనే అని ఆమె చెప్పుకొచ్చారు.సక్సెస్ రెసిపీ ఎవరికీ తెలియదని సక్సెస్ ఫెయిల్యూర్ ప్రయాణంలో భాగమని కృతి తెలిపారు.

ఫెయిల్యూర్స్ వచ్చిన సమయంలో తప్పులను విశ్లేషించుకుని ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటానని ఆమె అన్నారు.ప్రతి భాషలో సినిమా చేయాలనేది నా ఆలోచన అని కృతి పేర్కొన్నారు.

కృతిశెట్టి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు