ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.కన్నడ ఇండస్ట్రీలో అద్వైత పేరుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కుర్ర హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుని తెలుగులోకి సుకుమార్ టీం తీసుకొచ్చింది.
ఆమెలో ఉండే ఛరిష్మా ముందే పసిగట్టిన సుకుమార్ టీమ్ అందుకు తగ్గట్లుగానే కృతి శెట్టిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.నీ కళ్ళు నీలి సముద్రం పాటలో ఆమె లుక్ అందరిని ఆకట్టుకుంది.
ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ మరో మంగళూరు భామ అడుగుపెట్టిందని అందరూ భావించారు.టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్లుగా ఉన్నవారిలో ఎక్కువమంది కన్నడ నాటనుంచి వచ్చినవారే.
స్టార్ హీరోయిన్ అనుష్క, ప్రస్తుతం స్టార్స్ హీరోయిన్లు గా దూసుకుపోతున్న పూజా హెగ్డే, రష్మిక మందన కర్ణాటక నుంచి వచ్చిన అందగత్తెలే.
ఇప్పుడు వారి దారిలోనే క్రేజీ హీరోయిన్ గా కృతి శెట్టి కూడా మారబోతుంది.
ఇంకా మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాకుండానే నేచురల్ స్టార్ నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ లాంటి పీరియాడికల్ ప్రాజెక్ట్ లో అమ్మడు అవకాశం సొంతం చేసుకుంది.ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టిని హీరోయిన్ గా ఖరారు చేశారు.
దీంతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ హీరోలుగా తెరకెక్కనున్న మలయాళీ హిట్ మూవీ కప్పెల రీమేక్ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.మొత్తానికి మొదటి సినిమా మీద ఉన్న పాజిటివ్ టాక్ కారణంగా ఈ మంగళూరు భామ అప్పుడే మూడు సినిమాలని వరుసగా చేసే అవకాశం సొంతం చేసుకోవడం చూస్తుంటే ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.