ఎప్పటికైనా బాలయ్యకు గట్టిగా ఇస్తాడట!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ఈ స్టార్ హీరో.

కాగా గతంలో బాలయ్య 100వ చిత్రంగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.అయితే అప్పటి నుండి బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడు ఓ డైరెక్టర్.

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కృష్ణవంశీ, బాలయ్యతో ‘రైతు’ అనే సినిమాను 100వ చిత్రంగా తెరకెక్కించాలని ప్రయత్నించాడు.కానీ ఆ సమయంలో అది కుదరలేదు.

దీంతో బాలయ్యతో సినిమా చేసే అవకాశం ఆయనకు మళ్లీ దక్కలేదట.దీంతో ఎప్పటికైనా బాలయ్యతో రైతు చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంటానని కృష్ణవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

కాగా ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి తన ప్రత్యేకతను చాటేందుకు కృష్ణవంశీ రెడీ అవుతున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు