డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన సినిమా జెట్టి. ఈ సినిమాలో తేజశ్వని బెహెర, ఎమ్మెస్ చౌదరి, జి కిషోర్, గోపి, జీవ, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, సుమన్ శెట్టి, నందిత శ్వేతా తదితరులు నటించారు.
ఈ సినిమాను వర్ధని ప్రొడక్షన్ బ్యానర్ పై కే వేణుమాధవ్ నిర్మించాడు.కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించాడు.
అయితే ఈ సినిమా మత్స్యకారుల నేపథ్యంలో రూపొందింది.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా.ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.కటారి పాలెం అనే గ్రామం సముద్ర తీరంలో ఉండేది.ఈ గ్రామం కు చాలా కట్టుబాట్లు ఉంటాయి.ఇక వీటిని గ్రామ పెద్ద అయినా జాలయ్య (ఎమ్మెస్ చౌదరి) ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు.అంతేకాకుండా ఆ ఊరికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కూడా కాపుగా ఉంటాడు.
అయితే తరచూ ఆ గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్స్ తుఫానుల తాకిడితో కొట్టుకుపోయి తీవ్రమైన నష్టాన్ని మిగిలిస్తాయి.దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే దశరథ రామయ్య (శివాజీ రాజా) ను ఎలాగైనా జెట్టి నిర్మించాలని మత్స్యకారులు ఆయనను కోరుతారు.
దీంతో అతడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో జెట్టిని కట్టలేనని చెప్పేస్తాడు.
అంతేకాకుండా ఈ చెట్టు నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి) అడ్డుగా ఉంటాడు.
అయితే ఆ సమయంలో ఆ గ్రామానికి శ్రీ (కృష్ణమాన్యం) ఉపాధ్యాయునిగా వస్తాడు.ఆ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ ఉంటాడు.ఆ సమయంలో జాలయ్య కూతురు మీనాక్షి (నందిత శ్వేత) ను చూసి ఇష్టపడతాడు.ఇక ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది.అయితే వీరిద్దరూ ఆ గ్రామాన్ని వదిలి వెళ్తారు.దీంతో ఆ ఊరిలో సంప్రదాయం, కట్టుబాట్లు ఉండటంతో జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు.
దీంతో చివరికి జాలయ్య వారిని ఏం చేస్తాడు.జెట్టిని కోరిన మత్స్యకారుల కోరిక తీరుస్తారా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన కృష్ణ అద్భుతంగా నటించాడు.ఒక టీచర్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు.
జాలయ్య పాత్రలో నటించిన ఎమ్మెస్ చౌదరి కూడా అద్భుతంగా నటించాడు.నందిత శ్వేత కూడా గ్రామీణ యువతి పాతలో చక్కగా నటించింది.
ఇక మిగతా నటీనటునంతా తమ పాత్రలకు అద్భుత న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా సినిమా కథ బాగా ఉంది అని చెప్పవచ్చు.పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు దర్శకుడు.సంగీతం బాగుంది.
ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమాను మత్స్యకారులకు జెట్టి అవసరం ఏమిటనే కోణంలో చూపించాడు దర్శకుడు.మంచి సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంగా కథను చక్కగా రూపుదిద్దాడు.
ఎమోషనల్ సన్నివేశాలను కూడా బాగా చూపించాడు.మొత్తానికి కథ, కథనాలు ప్రేక్షకులను బాగా కట్టిపడేసాయని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త పడితే బాగుండేది.
బాటమ్ లైన్:
ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.