గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.ఇళ్లు కూల్చివేతల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇందిరాగాంధీ, మహాత్మాగాంధీ విగ్రహాలను కూల్చివేశారని మండిపడ్డారు.
రోడ్డు విస్తరించడానికి ఇదేమైనా కాకినాడనా? లేక రాజమండ్రినా? అని ప్రశ్నించారు.ఇప్పటం గ్రామస్థులు జనసేన సభకు స్థలం ఇవ్వడం కారణంగానే వారిపై కక్ష కట్టారని ఆరోపించారు.
ఇలానే చేస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ ఆయన హెచ్చరించారు.రోడ్లపై గుంతలు పూడ్చలేరు కానీ రోడ్ల విస్తరణ చేస్తారా అంటూ నిలదీశారు.