భీమవరం పట్టణంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు.
ఒక విద్యార్థిని గదిలో నిర్బంధించి అమానుషంగా దాడి చేశారు.ఓ యువతి విషయంలో వివాదం తలెత్తడంతో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న అంకిత అనే విద్యార్థిని గదిలో నిర్బంధించి కర్రలతో… దాడి చేశారు.
అనంతరం ఇస్త్రీ పెట్టితో కాల్చి చిత్రహింసలు పెట్టారు.
ఈ క్రమంలో తనని విడిచి పెట్టాలని బాధిత విద్యార్థి.
బతిమాలిన గాని తోటి విద్యార్థులు కనికరించలేదు.అయితే సదరు విద్యార్థి పై దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది విద్యార్థులు వీడియో తీయడంతో అది నిన్న వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు.
ఈ క్రమంలో దాడికి పాల్పడిన ప్రేమ్, ప్రవీణ్, నీరజ్, స్వరూప్ లపై కేసు నమోదు చేశారు.ఈ విద్యార్థులంతా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారిని పోలీసులు తెలిపారు.
ఇక ఇదే సమయంలో ఘటనపై స్పందించిన కాలేజీ యజమాన్యం బాధిత యువకుడు మరియు యువతి సహా ఆరుగురిని కాలేజీ నుండి సస్పెండ్ చేశారు.







