టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.సాయిపల్లవి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలో సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి పలు డ్యాన్స్ పోటీలలో పాల్గొని సక్సెస్ సాధించారు.అయితే తాజాగా సాయిపల్లవి డ్యాన్స్ పోటీలంటే తనకు అసహ్యమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
డ్యాన్స్ పోటీలపై తనకు నమ్మకం లేదంటూ సాయిపల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు.గతంలో తమిళంలో ప్రసారమవుతున్న ఒక డ్యాన్స్ షోకు పాల్గొన్న సాయిపల్లవి ఆ షోలో రెండో స్థానంలో నిలిచారు.
అయితే తనకు ప్రతిభ ఉన్నా ధన బలం వల్లే ఫస్ట్ ప్రైజ్ రాలేదని ఆమె పేర్కొన్నారు.డ్యాన్స్ పోటీలలో ప్రతిభకు ఎప్పుడూ గౌరవం దక్కదని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
టీవీ ఛానెళ్లు డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయని సాయిపల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు.అలా కాకపోతే ప్రముఖుల వారసులకు టీవీ ఛానెళ్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
ఈ రీజన్ వల్లే డ్యాన్స్ పోటీలు అంటే తనకు అసహ్యమని ఆమె పేర్కొన్నారు.సాయిపల్లవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ సాయిపల్లవి చేసిన కామెంట్లతో చాలామంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.మరోవైపు సాయిపల్లవి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే ఓకే చెబుతుండటంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయి.సాయిపల్లవికి ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు.స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సినీ కెరీర్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సాయిపల్లవి కెరీర్ విషయంలో మరింత సక్సెస్ అవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.







