తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా రష్మీకి తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది రష్మీ.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోతో పాటు జబర్దస్త్ షోకీ యాంకర్ గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ.ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు ఈవెంట్లలో తన స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతూ ఉంటుంది.
అలాగే ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది రష్మీ.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ నందు జంటగా కలిసి నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.
ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాను ఐమాక్స్ లో వీక్షించిన చిత్ర బృందం అనంతరం మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ.సినిమా బాగుంది.
ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని హీరో నందు అన్నాడు.ఆ తర్వాత రష్మీ మాట్లాడుతూ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు చూసే సెన్సార్ బోర్డు వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారని రష్మీ అన్నది.
కానీ ఈ సినిమాను కుటుంబంతో సహ వచ్చి చూడొచ్చాని, చూడాలని అభిమానులను కోరింది రష్మీ.
కాగా ఐమ్యాక్స్ ముందు వారు మాట్లాడుతుండగా అభిమానులు పెద్ద ఎత్తున రష్మీని కలవడానికి ఎగబడ్డారు.అయితే ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో నందు రష్మీకి సపోర్టుగా నిలబడ్డాడు.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ పూలదండలను నందు, రష్మీల మీదకు విసిరారు.
దాంతో ఈ వీడియో చూసిన అభిమానులు రష్మీ మాస్ క్రేజ్ చూసి ఆశ్చర్య పోతున్నారు.అభిమానులు ఒక్కసారిగా రష్మీ తో సెల్ఫీలు దిగడానికి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగపడడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది.
కాగా అభిమానులు రష్మీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.