Krishna makeup man madhava rao: కృష్ణ చనిపోయాక ఏడుస్తూ మేకప్ చేశానన్న మాధవరావు.. అలాంటి వ్యక్తంటూ?

సూపర్ స్టార్ కృష్ణ మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టగా కృష్ణ గొప్పదనం గురించి, ఆయన గురించి తెలియని విషయాలను సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణగారు ఎప్పుడు కలిసినా ఏదైనా సహాయం కావాలంటే అడగమని చెప్పేవారని మాధవరావు తెలిపారు.ఫిల్మ్ నగర్ లో అపార్టుమెంట్ కొనుగోలు చేయడానికి డబ్బులు తక్కువైతే విజయనిర్మల గారు డబ్బు సహాయం చేశారని మాధవరావు అన్నారు.

విజయనిర్మల గారితో ఏదో రుణానుబంధం ఉందనే భావన నాకు ఉందని మాధవరావు పేర్కొన్నారు.తమ దగ్గర పని చేసేవాళ్లను కృష్ణ, విజయనిర్మల ఎంతో బాగా చూసుకున్నారని మేకప్ మ్యాన్ అన్నారు.

కృష్ణగారు చనిపోయిన తర్వాత ఆయన ఫేస్ క్లీన్ చేసి ఆయన దగ్గరే ఉన్నానని మాధవరావు తెలిపారు.ఏడుస్తూనే ఫేస్ క్లీన్ చేసి మేకప్ వేసి ఐస్ బాక్స్ లో ఉంచానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఆ తర్వాత కృష్ణ అంత్యక్రియలు జరిగే వరకు ఆయన పార్థివదేహంతో ఉన్నానని మాధవరావు అన్నారు.

కృష్ణగారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన తెలిపారు.కృష్ణగారికి ఏదైనా దెబ్బ తగిలితే బ్లడ్ మాత్రం ఆగేది కాదని మాధవరావు వెల్లడించారు.ఆయనకు నాపై ఎంతో నమ్మకం ఉండేదని ఆయన పేర్కొన్నారు.

మహేష్ తల్లి ఇందిర కూడా ఎంతో గౌరవంగా చూసుకునేవారని ఆమె నన్ను అన్నయ్య అని పిలిచేవారని మాధవరావు వెల్లడించారు.కృష్ణ రెండో పెళ్లి సమయంలో ఇందిరకు కొంత కోపం ఉన్నా ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన అన్నారు.

మేకప్ మ్యాన్ మాధవరావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు