ఆహాలో క్రాక్‌ సినిమా ఆలస్యం.. ఆగినందుకు అల్లు వారికి కోటిన్నర లాభం

సంక్రాంతి సందర్బంగా వచ్చిన క్రాక్‌ సినిమాను ఈ నెల 29న ఆహాలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

రవితేజ మరియు గోపీచంద్‌ మలినేనిల కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్‌ మూవీ రికార్డుల వర్షం కురిపించింది.

లాక్‌ డౌన్‌ తర్వాత విడుదలైన సినిమాల్లో క్రాక్‌ సినిమా నెంబర్‌ 1 గా నిలిచింది.దాదాపుగా 50 కోట్ల వసూళ్లు రాబట్టిన క్రాక్‌ సినిమా కరోనా తర్వాత కొత్త బూస్ట్ ను ఇండస్ట్రీకి ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

దాదాపుగా మూడు వారాలు అయినా కూడా ఏమాత్రం షేర్‌ తగ్గలేదు.ఆక్యుపెన్సీ కూడా భారీగా ఉంటుంది.

దాంతో సినిమా ను ఇంకా వారం రోజుల పాటు ఆడించాలని ఓటీటీ లో వారం ఆలస్యంగా విడుదల చేయాలని నిర్మాత ఠాగూర్‌ మధు తో డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా ను ఇప్పటికే ఆహా వారు రూ.8.5 కోట్లకు కొనుగోలు చేశారు.సినిమా మూడు వారాల తర్వాత స్ట్రీమింగ్‌ చేసుకునేందుకు ఆహా ఒప్పందం చేసుకుంది.

Advertisement

కాని ఇప్పుడు వారం ఆలస్యంగా స్ట్రీమింగ్‌ చేసుకునేందుకు నిర్మాత ఒప్పందం సవరించుకున్నాడు.దాంతో దాదాపుగా కోటిన్నర రూపాయలను వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది.

ఠాగూర్‌ మధు ఈ కోటిన్నర రూపాయలను వెనక్కు ఇచ్చేసినా థియేటర్‌ లో ఈ వారం రోజులు భారీగానే వసూళ్లు సాధించే అవకాశం ఉందంటున్నారు.కనుక ఆహా వారికి కాని నిర్మాతకు కాని వచ్చిన నష్టం ఏమీ లేదు.

భారీ అంచనాలున్న క్రాక్‌ సినిమా ఓటీటీలో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు.ఆహా ప్రారంభించిన తర్వాత తీసుకున్న మొదటి పెద్ద సినిమా ఇది.కనుక ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఆహాలో క్రాక్‌ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.ఫిబ్రవరి మొదటి వారంలో క్రాక్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు