తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏ విధంగా అయితే ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆ పార్టీకి తీవ్ర తలవంపులు తీసుకువచ్చాడో అందరికి తెలిసిందే.ఆయన వ్యవహారశైలి కారణంగా తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది.
ఇప్పుడు అధికార వైసీపీ కి కూడా ఓ ఎమ్మెల్యే కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఆయనే నెల్లురూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మొదటి నుంచి ఆయన వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది.తాజాగా ఓ మహిళా ఎంపీడీవో పై దౌర్జన్యం చేయడం, అది కాస్తా వివాదాస్పదం అవ్వడం ఈ నేపథ్యంలో ఆయన మీద వైసీపీ కేసు నమోదు చేయడం ఇవన్నీ జరిగిపోయాయి.
అయితే చింతమనేని విషయంలో టీడీపీ చేసిన తప్పు వైసీపీ చేయకుండా తమ సొంత ఎమ్యెల్యే మీద కేసు నమోదు చేయించి సాహసమే చేసిందనే చెప్పాలి.

ఇక విషయాన్ని పక్కనపెడితే ఇప్పుడు ఆ వైసీపీ నాయకత్వంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు.తనకు టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని.కానీ వైసీపీలో తనకు తరచూ అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆయన ఇసుక విషయమై గళమెత్తుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఒకవైపు ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీ పార్టీలు ఇసుక అంశం పై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో సొంత పార్టీ ఎమ్యెల్యే ఇలా అసమ్మతి స్వరం వినిపిస్తుండడం వైసీపీకి ఇబ్బందిగా మారింది.
ఇసుక మాఫియా అంతు చూస్తానంటూ శ్రీధర్ రెడ్డి స్వరం పెంచుతున్నారు.ఆన్‌లైన్‌లో రెండు నిమిషాలకే నో స్టాక్ బోర్డు వస్తోందని.
నెల్లూరులోని ఓ రీచ్ నుంచి ఎమ్మెల్యేల పేరుతో ఇసుక తరలిస్తున్నారని కోటం రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యంగా సర్వేపల్లి ఎమ్యెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి మీద ఉన్న వివాదం కారణంగానే ఆయన ఈ విధంగా గళమెత్తుతున్నట్టు అర్ధం అవుతోంది.కొద్ది రోజుల క్రితం ఎంపీడీవోపై దాడి చేసిన ఘటనలో.ఆయనపైనే కోటంరెడ్డి ఆరోపణలు చేశారు.
అప్పట్లో.వైసీపీ పెద్దలు రెండు వర్గాలనూ అమరావతి పిలిపించి సెటిల్మెంట్ చేశారు.
కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి రాగం తీవ్ర స్థాయిలో వినిపించడం వివాదం అవుతోంది.సొంత పార్టీ ఎమ్యెల్యే ఇలా ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా వ్యాఖ్యలు చేయడంపై లోలోపల వైసీపీ నాయకులు ఆగ్రంగా ఉన్నా పైకి మాత్రం వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు.
కోటంరెడ్డి వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి.