నా కన్న కొడుకే పోయాక ఎంత ఆస్తి ఉంటే ఏంటి.. ఎమోషనల్ అయిన కోట!

సినిమా రంగానికి చెందిన వాళ్లు ఎన్ని ఆస్తులు సంపాదించినా కన్నపిల్లల కంటే ఆ ఆస్తులు ఎక్కువ కాదనే సంగతి తెలిసిందే.చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే కోటకు ఆసక్తి ఉండగా సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు బ్యాంక్ లో జాబ్ చేశారు.

 Kota Srinivasarao Emotional About His Son Details Here Goes Viral In Social Med-TeluguStop.com

తన నటనతో ఎన్నో నంది అవార్డులను కోట శ్రీనివాసరావు వెల్లడించారు. గణేష్, పృథ్వీ నారాయణ, అహ నా పెళ్లంట, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో సినిమాలు కోట శ్రీనివాసరావుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఎన్నో సినిమాల సక్సెస్ లో కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించడం గమనార్హం.అయితే ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సినీ కెరీర్ కు సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

అప్పట్లో హీరోయిన్లు లావుగా ఉన్నా ప్రేక్షకులు ఆదరించేవారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. సావిత్రిలా ఎక్స్ ప్రెషన్లు ఎవరు ఇవ్వగలరని కోట అన్నారు.

సౌందర్య వరకు ఎంతోమంది హీరోయిన్లు తమ నటనతో మెప్పించారని ఆయన తెలిపారు.ఆర్థికంగా చితికిపోవడం వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.నేను సంపాదించుకున్న ఆస్తుల విషయంలో తృప్తి ఉందని ఆయన తెలిపారు.నాకు ఎన్ని రూ.కోట్లు ఉన్నాయో నాకు తెలుసని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

కొన్ని కోట్ల మంది కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నానని కోట పేర్కొన్నారు.అయితే కోట్ల ఆస్తులు ఉన్నా కొడుకును పోగొట్టుకున్నానని ఆయన వెల్లడించారు.నేను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో వాతావరణం వేరని ఇప్పటి వాతావరణం వేరని కోట శ్రీనివాసరావు తెలిపారు.

కొడుకు గురించి చెబుతున్న సమయంలో కోట శ్రీనివాసరావు చాలా ఎమోషనల్ అయ్యారు.కోట శ్రీనివాసరావు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube