ముసలి వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న జంట..

ఈరోజుల్లో సోషల్ మీడియా ప్రభంజనం వల్ల ఏ మూల జరిగిన విషయమైనా వెలుగులోకి వస్తోంది.ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

 Even In Old Age, The Couple Impressed By Dancing, Viral Video, Viral News, Trend-TeluguStop.com

చిన్న పిల్లల డ్యాన్స్ నుంచి పెద్దల వరకు అందరి వీడియోలు సోషల్ మీడియా పుణ్యమాని చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నారు.ఈ డ్యాన్స్ వీడియోలలో చాలావరకు పెళ్లి వేడుకల నుంచి వస్తాయి అనడంలో సందేహం లేదు అయితే తాజాగా ఒక పెళ్లి వేడుకలో ఇద్దరు ముసలి వాళ్లు చాలా యాక్టివ్ గా డాన్స్ చేసి అదరగొట్టారు దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెళ్లి వేడుకలో 60 ఏళ్లకు పైబడిన దంపతులు డాన్స్ చేయడం చూడవచ్చు వారు చాలా యాక్టివ్‌గా డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ వారిని మరింత ఎంకరేజ్ చేశారు.దాంతో ఆ జంట మరింత ఉత్సాహంతో స్టెప్పులు వేసింది.

కేరళలో ఈ డ్యాన్స్ వెలుగు చూసింది.దీనిని జిషా డేవిస్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు.

ఈ వీడియోలో ‘ముంతిరి పదం’ పాటకు ఈ మలి వయసు దంపతులు డ్యాన్స్ చేశారు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ కాగా దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.ఈ వయసులోనూ ఆ జంట ఊపు చూస్తుంటే వారికి ఇంకా ఏం వయసు అయిపోలేదని, ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఇంకా వయసులో ఇంకెంత ఉత్సాహంగా వీళ్ళు ఉండేవారు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ఈ అమేజింగ్ డ్యాన్స్ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube