డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం సహజం.కానీ డాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడం చాలా అరుదు.
కానీ ఇదే జరిగింది ఒక నటుడి జీవితంలో.ఆయన తండ్రి ఒక పేరు మోసిన వైద్యుడు.
కానీ ఈయన మాత్రం తండ్రి వృత్తికి పూర్తి భిన్నంగా నటుడయ్యాడు.ఆ నటుడు ఎవరో కాదండి.
తెలుగు సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ నటుడు కోట శ్రీనివాస రావు గారు.కోట శ్రీనివాస రావు గారి తండ్రి కోట సీత రామ ఆంజనేయులు( Anjaneyulu ) గారు ఒక వైద్యుడు.వీరిది ఆంధ్ర ప్రదేశ్ లోని కంకిపాడు.కంకిపాడు ఆంజనేయులు అంటే అప్పట్లో చాలా ఫేమస్.మరి ఇంతటి పేరు ప్రతిష్టలు ఉన్న ఒక డాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వడానికి కారణం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? ఐతే ఇది చూడండి.
కోట శ్రీనివాస రావు గారు గారికి ఇద్దరు సోదరులు.ఒక అన్నయ్య, ఒక తమ్ముడు.కోట గారి తమ్ముడు కోట శంకర్ రావు( Kota Shankar Rao )ఈయన మనందరికీ పరిచయమున్న మనిషే.
ఈయన కూడా ధర్మ చక్రం, సూర్య ఐపిఎస్ వంటి చిత్రాలలో నటించాడు.కానీ మానెవ్వరికి తెలియనిది కోట గారి అన్నయ్య గురించే.కోట శ్రీనివాస రావు గారి అన్నయ్య కోట నరసింహ రావు గారు.కోట శ్రీనివాస రావు గారు సినిమాలలోకి రావడానికి కారణం ఆయనేనట.
కోట నరసింహ రావు( Kota srinivasa rao ) గారు చాలా మంచి కళాకారుడట.నాటకాలు వేయడం, పాటలు రాయడం చేసేవారట.
ఐతే అప్పట్లో పల్లెటూర్లలో ఉచ్చారణ సరిగ్గా వచ్చిన నటులు దొరకడం చాలా అరుదట.అందుకని ఆయన తన తమ్ములనే పెట్టి నాటకాలు వేసేవారట.
అలా అన్నయ్య వాళ్ళ నటన వైపు మనసు మళ్లిందట కోట శ్రీనివాస రావు గారికి.
కోట శ్రీనివాస రావు గారు 1942 లో ఆంధ్ర ప్రదేశ్ లోని కంకిపాడు లో జన్మించారు.ఈయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో అనేక చిత్రాలలో నటించారు.ఈయన 1999 నుంచి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఎంఎల్ఏ గా ఉన్నారు.2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ శ్రీ తో సత్కరించింది.