నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) పుట్టినరోజు కావడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఎవరికి తోచిన విధంగా వారు గ్రాండ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు రక్తదానాలు అన్నదానాలు సామాజిక సేవలు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
తాజాగా కూడా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ఇ చాలా సందర్భాలలో అనేక విధాలుగా రైతులను రైతు కుటుంబాలను ఆదుకున్న విషయం తెలిసిందే.

ఆత్మహత్యలు చేసుకుని మరణించిన కుటుంబాలకు లక్షలు డబ్బులని ఇచ్చి ఆదుకున్నారు.అయితే పవన్ కల్యాణ్( Pawan kalyan ) చేసిన సాయాన్ని తెనాలి రూరల్ మండలం అత్తోట గ్రామ వాసులు గుర్తు పెట్టుకున్నారు.ఆయన సేవలకు గాను తమ అభిమానం తెలియజేసే విధంగా ప్రత్యేకంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతులు తమకు తెలిసిన సాగుని గుర్తు చేసుకుంటూ వరి పొలంలో జనసేన లోగోను వేశారు.దాదాపు ఇరవై రోజుల పాటు శ్రమించి వరి నారును లోగోగా నాటి పెంచారు.

సరిగ్గా జనసేనాని పుట్టిన రోజు( Happy birthday ) నాటికి వరి పైరు కొద్దీగా పెరిగి జనసేన పార్టీ లోగో స్పష్టంగా కనిపిస్తుంది.పవన్ కల్యాణ్ కోసం ఆ త్తోట రైతులు ఆ న్నా స్లోగన్ కూడా జత చేశారు.ఈ స్లోగన్ ను వరి నారుతోనే రాశి తమ అభిమానాన్ని ప్రకటించారు రైతులు.ఇందుకోసం రెండు రకాల వరి వంగడాలను వాటినట్లు రైతులు తెలిపారు.కాలా బట్టీ, మైసూర్ మల్లిక వరి వంగడాలను వినయోగించామని అన్నారు.అయితే లోగోలో ఉన్న వరి పైరును పండించి, ధాన్యం వచ్చిన తర్వాత బియ్యాన్ని తీసి పవన్ కల్యాణ్ కు పంపించనున్నట్లు రైతులు( Farmers ) తెలిపారు.
సాధారణంగా ఈ రెండు రకాలు వరి నాట్లు నాటు విత్తనాలను ఉపయోగించారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు రైతులపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







