చిరు, ఎన్టీఆర్ కోసం డీఎస్పిని వదిలేసిన కొరటాల శివ.. కారణం?

సినీ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకుడిగా మారారు.ఈయన ప్రభాస్ హీరోగా మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

 Koratala Siva Left Devisriprasad For Chiru And Ntr Why Details, Koratala Shiva,-TeluguStop.com

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇలా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో తదుపరి కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకి అదేవిధంగా ఎన్టీఆర్ తో కొరటాల చేయబోయే సినిమాకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను కొరటాల పక్కన పెట్టారు.

అయితే దేవి శ్రీ ప్రసాద్ ను కొరటాల శివ పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే….మెగాస్టార్ చిరంజీవి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆచార్య సినిమా కోసం సంగీత దర్శకుడిగా మణిశర్మకి అవకాశం కల్పించాలని మెగాస్టార్ సూచించడంతో తప్పనిసరి పరిస్థితులలో దేవిని పక్కన పెట్టాల్సి వచ్చింది.

Telugu Anirudh, Devisree Prasad, Koratala Siva, Jr Ntr, Koratala Shiva, Manishar

అదేవిధంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న 30వ చిత్రానికి అనిరుద్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని తారక్ సూచించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోని ఈ ఇద్దరు హీరోల విన్నపం మేరకు కొరటాల దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube