తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొరటాల, బతిమిలాడుతున్న చరణ్‌...!  

  • ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క సినిమాతో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ. చేసిన నాలుగు సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచిన కారణంగా కొరటాల శివకు మస్త్‌ గిరాకీ ఉంది. ఇండస్ట్రీలో భారీ పారితోషికాలు తీసుకుంటున్న టాప్‌ 3 దర్శకుల జాబితాలో ఆయన ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా విజయాన్ని అందుకుంటున్న నేపథ్యంలో ఆయనతో సినిమా చేయాలని చిరంజీవి ఆశ పడ్డాడు. ఇప్పటికే చరణ్‌ ఆయనకు అడ్వాన్స్‌ ఇచ్చాడు.

  • Koratala Siva Is Angry On Hero Ram Charan For Delaying His Movie-Koratala Next Movie Ram And Combo

    Koratala Siva Is Angry On Hero Ram Charan For Delaying His Movie

  • సినిమా వెనుక సినిమా చేయాలనేది కొరటాల అభిప్రాయం. భరత్‌ అనే నేను విడుదలై ఆరు నెలలు గడిచి పోయింది. అయినా ఇంకా సినిమా ప్రారంభించక పోవడంతో కొరటాలలో చిరాకు మొదలైందట. చిరంజీవితో సినిమాకు నవంబర్‌ లేదా డిసెంబర్‌ను కొరటాల ప్లాన్‌ చేసుకున్నాడు. కాని కొరటాలకు చిరంజీవి డేట్లు దొరకడం లేదు. జనవరిలో చేద్దాం అంటూ మొన్నటి వరకు చరణ్‌ చెబుతూ వచ్చాడు. కాని ఇప్పుడు సైరా చిత్రీకరణలో బిజీగా ఉన్న చిరంజీవి ఏప్రిల్‌ వరకు కొరటాలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో కొరటాల మరో హీరోతో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

  • Koratala Siva Is Angry On Hero Ram Charan For Delaying His Movie-Koratala Next Movie Ram And Combo
  • కొరటాల మరో హీరోతో సినిమా చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడంటూ తెలియగానే వెంటనే చరణ్‌ రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏప్రిల్‌లో ఖచ్చితంగా సినిమాను మొదలు పెడదాం, కాస్త ఓపిక పట్టు అంటూ కొరటాలను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తి చేసి కొరటాల వెయిటింగ్‌ చేస్తున్నాడు. నాలుగు నెలలుగా కొరటాల పూర్తి కాలీగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన ఆగ్రహంతో మండి పోతున్నాడట. సైరా పెద్ద సినిమా అవ్వడంతో కొరటాలను చిరంజీవి వెయిట్‌ చేయిస్తున్నాడు. కొరటాల మరో సినిమాకు కమిట్‌ అయితే చిరంజీవితో సినిమాకు ఛాన్స్‌ లేనట్లే. అందుకే చరణ్‌ కాస్త ఎక్కువ పారితోషికం ఇచ్చి అయినా ఆయన్ను ఆపాలని భావిస్తున్నాడు. అందుకే ఆయన్ను బతిమిలాడుతున్నాడు.