జూనియర్ ఎన్టీఆర్ మామూలు వ్యక్తి కాదు.. కొరటాల శివ కామెంట్స్ వైరల్!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ స్వతహాగా ఇంటెలిజెంట్ యాక్టర్ అని అన్నారు.నేను తారక్ కు కథ చెప్పిన ఆయన తీసుకునే విధానం మరోలా ఉంటుందని కొరటాల శివ కామెంట్లు చేశారు.

తారక్ అన్నీ తెలిసిన మనిషి అని కొరటాల శివ పేర్కొన్నారు.ప్రతి అంశం గురించి తారక్ కు ఊహించని స్థాయిలో నాలెడ్జ్ ఉందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

పాత్రకు అనుగుణంగా ఎలా చేయాలో ఆ విధంగా తారక్ సిద్ధమవుతారని కొరటాల శివ కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement

స్టార్ హీరోలు చాలా సెన్సిటివ్ గా ఉంటారని వాళ్లకో స్ట్రెంత్ ఉంటుందని కొరటాల శివ కామెంట్లు చేశారు.వాస్తవానికి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం సులువు అని కొరటాల శివ కామెంట్లు చేశారు.మరోవైపు తారక్ కొరటాల శివ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా డిసెంబర్ సమయానికి ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేయాలని తారక్ కొరటాల శివకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందుతోంది.

కొరటాల శివ ఆ సమయానికి పనులు పూర్తి చేసి షూటింగ్ మొదలుపెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరగలేదనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.సోలో హీరోగా తారక్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు