అలాంటి పాత్రలు చేయడం అంటేనే ఇష్టం అంటున్న బాలీవుడ్ హీరోయిన్

నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత మంది అందాల భామలు స్టార్ హీరోయిన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.

కోట్ల రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనే గుర్తింపుని అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే కొంత మంది భామలు మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ కంటే నటిగా తన ఐడెంటిటీ ఏంటి.కెరియర్ లో ఎన్ని రకాల డిఫరెంట్ పాత్రలు చేశాను అనే లెక్కలు వేసుకొని సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటారు.

వీళ్ళు డబ్బుకి అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు.మరికొంత మంది భామలు అయితే నటిగా సమాజంలో మహిళలకి సంబందించిన సామాజిక సమస్యలని రిప్రజెంట్ చేసే పాత్రలలో నటించాలని కలలు కంటూ ఉంటారు.

అలాంటి పాత్రలు వస్తే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, డాక్యుమెంటరీనా అనే విషయాన్ని పట్టించుకోరు.అలాంటి పాత్రలు వచ్చిన వెంటనే ఒప్పుకొని మనసు పెట్టి ఆ పాత్రలకి న్యాయం చేయడంతో పాటు ఈ సినిమా ద్వారా సమాజంలో మహిళలకి సంబందించిన ఒక మంచి విషయాన్ని రిప్రజెంట్ చేశాననే సంతృప్తి చెందుతారు.

Advertisement

ఈ మూడో కేటగిరీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ కనిపిస్తారు.అపర్ణాసేన్, కొంకనా సేన్ శర్మ, సభానా అజ్మీ లాంటి నటీమణులు మూడో కేటగిరీలోకి వస్తారు.

బెంగాలీకి చెందినా కొంకనా సేన్ శర్మ కూడా ఎక్కువగా ఆర్ట్స్ మూవీస్, విమెన్ సెంట్రిక్ కథల్లోనే నటించింది.బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ బాషలలో ఈమె సినిమాలు చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ తనకి ఎలాంటి కాన్సెప్ట్ అయినా సమాజంలో ఏదో ఒక విధంగా బాధింపబడుతున్న అమ్మాయిల పాత్రలలో నటించడం అంటే నాకు ఇష్టం.అలాంటి పాత్రలలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలని రిప్రజెంట్ చేయడంలో నాకు సంతృప్తి ఉంటుందని పేర్కొంది.

సినిమాలకి సెన్సార్ ఉండటం వలన కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు.అయితే ఒటీటీకి సెన్సార్ అనేది ఉండదు కాబట్టి కంటెంట్ స్వేచ్చగా చెప్పే అవకాశం దొరుకుతుందని కొంకనా సేన్ శర్మ చెప్పుకొచ్చింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు