యాదాద్రి జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక జోలికి వెళ్లనని భువనగిరి ఎంపీ,కాంగ్రేస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మనుసులో మాటను బయటపెటారు.తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో మునుగోడు బైపోల్ కు అవకాశం ఏర్పడింది.
ఈ సందర్భంగా తమ్ముడికి సహకరించాలంటూ అన్న వత్తిడి చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే.ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ’మునుగోడు జోలికి వెళ్లనని,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.







