సాధారణంగా హీరోలు అంటే సినిమాల్లో మాత్రమే మంచివాళ్లుగా కనిపిస్తారని నిజ జీవితంలో మాత్రం అలా ఉండరని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.నిజానికి రియల్ లైఫ్ లో కష్టాల్లో ఉండేవాళ్లను అదుకునే హీరోలు తక్కువగానే ఉంటారు.
కొందరు హీరోలకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నా వేర్వేరు కారణాల వల్ల సహాయం చేయడం సాధ్యం కాదు.అయితే తమిళనాడు స్టార్ హీరో అజిత్ మాత్రం ఇడ్లీ బండి నడుపుకుని జీవనం సాగించే వ్యక్తికి సహాయం చేసి వార్తల్లో నిలిచాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం వాలిమై సినిమా షూటింగ్ లో అజిత్ పాల్గొంటున్నారు.గతంలో టెక్నీషియన్స్, డ్రైవర్స్ కు వేతనాలు సకాలంలో అందకపోతే అజిత్ నిర్మాతతో మాట్లాడి సెటిల్ చేశారు.తాజాగా అజిత్ హైదరాబాద్ లో సొంత బైక్ పై ఊరంతా తిరిగారు.
రాత్రి సమయంలో తను స్టే చేసే ప్రాంతానికి దగ్గర్లో ఉండే ప్రాంతంలో ఒక ఇడ్లీ బండి దగ్గరకు అజిత్ వెళ్లేవారు.

ఇడ్లీ తినే సమయంలో ఇడ్లీలు తినే వ్యక్తి పడుతున్న కష్టాలను విని ఆయన చలించిపోయారు.పిల్లల చదువు కోసం ఇడ్లీలు అమ్మే వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడని తెలిసి వెంటనే లక్ష రూపాయలు అజిత్ అందజేశారు.అజిత్ గతంలో తన దగ్గర పని చేసే సిబ్బందికి సొంతంగా ఇళ్లు కూడా కట్టించారు.
అయితే సహాయం చేసినా ఆ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి అజిత్ పెద్దగా ఇష్టపడరు.
అజిత్ చేసిన సాయం గురించి నెట్టింట వైరల్ అవుతుండగా అజిత్ చేసిన సహాయం గురించి నెటిజన్లు అతనిని ప్రశంసిస్తున్నారు.
ఇడ్లీ వ్యాపారి కూతురు చదువు కోసం అంత పెద్ద మొత్తంలో అజిత్ సహాయం చేయడం గమనార్హం.రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉండే ఇడ్లీ వ్యాపారి అజిత్ ద్వారా సహాయం పొందినట్టు తెలుస్తోంది.