మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు పయణమైంది.ఆ టెస్టు మ్యాచ్‌ల తర్వాత మూడు వన్డేల సిరీస్‌లోనూ ఆడనుంది.
టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ సారథ్యం వహిస్తుండగా, వన్డేలకు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.తాజాగా ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకోగా అందులో విరాట్ మాత్రం కనిపించడం లేదు.
దీంతో ఆయన ఫ్యాన్స్ బీసీసీఐ తీరుపై ఫైర్ అవుతున్నారు.ప్లేయర్స్ అందరూ ఉన్నారని, కానీ మీకు విరాట్ మాత్రం కనిపించడం లేదా అంటూ సీరియస్ అవుతున్నారు.
తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కోహ్లీ వన్డేలో సారథ్యం విషయమై నన్నెవరూ సంప్రదించలేదని వెల్లడించాడు.గంట ముందుగా మాత్రమే వన్డేలకు కెప్టెన్సీగా మీరు ఉండటం లేదని నాకు బీసీసీఐ సమాచారం ఇచ్చిందంటూ ఘాటుగానే మాట్లాడాడు.
అయితే కోహ్లీ, బీసీసీఐకి మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.ఈ నెల 26వ తేదీ నుంచి టెస్టు మ్యాచుల సిరీస్ మొదలు కానున్నందున కోహ్లీ సారథ్యంలో మళ్లీ రికార్డ్ లు నెలకొల్పాలని చూస్తోంది.
దక్షిణాఫ్రికాలో ఆడిన టెస్టుల్లో ఇప్పటి వరకు టీమిండియా ఒక్క సిరీస్ ను కూడా కైవసం చేసుకోలేక పోయింది.భారత్.
దక్షిణాఫ్రికాలో 20 టెస్టులు ఆడింది.అందులో మూడు మాత్రమే గెలిచింది.
2018 చివరి పర్యటనలో గెలిచే ప్రయత్నం చేసినా సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది.టెస్టు సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి వన్డే సిరీస్ జరననుండటం విశేషం.గాయం కారణంతో రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.ఇక దక్షిణాఫ్రికాకు వెళ్తున్న టైంలో దక్షిణాఫ్రికాలో ఒక్క సిరీస్‌నూ కైవసం చేసుకోలేకపోయామని, ఎక్కడికి వెళ్లినా సిరీస్ గెలివాలి అన్నదే తమ ఆలోచన అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.