సన్మానం చేస్తామన్న బీసీసీఐ వద్దన్న కోహ్లీ... అసలేం జరుగుతోంది..

భారత క్రికెట్ నియంత్రణ మండలికి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని రోజుల నుంచి సరిగ్గా పడడం లేదు.

ఎప్పుడైతే విరాట్ కోహ్లీ తన టీ20 కెప్టెన్సీ వదిలేసుకుంటున్నట్లు ప్రకటించాడో ఇక అప్పటి నుంచి కోహ్లీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగా ఉంది.

కొన్ని రోజుల వ్యవధిలోనే అతడి నుంచి వన్డే కెప్టెన్సీని కూడా బీసీసీఐ లాగేసుకుంది.వన్డే కెప్టెన్సీ విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది.

కోహ్లీ విషయంలో బీసీసీఐ తప్పుగా ప్రవర్తిస్తోందని కొంత మంది ఆరోపించారు.మరికొంత మంది కోహ్లీదే తప్పు అంటూ బీసీసీఐ కి మద్దతు పలికారు.

ఇదంతా కొన్ని రోజుల ముందు వరకు జరిగింది.కానీ ఇండియా అదే గొడవలతో సౌతాఫ్రికా సిరీస్ ఆడింది.

Advertisement

టెస్టు సిరీస్ ను ఇండియా అప్పనంగా సౌతాఫ్రికాకు వదిలేసింది.ఇది జరిగిన తర్వాత కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.

కానీ అంతకు ముందే కోహ్లీకి బీసీసీఐ నుంచి ఓ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.అదేంటంటే.

కోహ్లీ ఇప్పటి వరకు 99 అంతర్జాతీయ టెస్టులు ఆడాడు.అతడు కెప్టెన్ గా అందించిన సేవలకు గాను అతడిని బీసీసీఐ ఘనంగా సన్మానించాలని చూసింది.

వందో టెస్టును బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో (కోహ్లీకి బెంగుళూరు స్టేడియం రెండో హోమ్ గ్రౌండ్ వంటిది.ఎందుకంటే అతడు ఐపీఎల్లో చాలా రోజుల నుంచి బెంగుళూరుకే ఆడుతున్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

) ఘనంగా సన్మానం చేయాలని భావించింది.తాను టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేస్తున్న విషయాన్ని కెప్టెన్ కోహ్లీ బీసీసీఐ అధికారులకు ఫోన్ ద్వారా తెలిపాడు.

Advertisement

దీంతో వారు అతడిని ఇంకో టెస్టుకు కెప్టెన్సీ చేయాలని వందో టెస్టులో ఘన సన్మానం ఏర్పాటు చేస్తామని అన్నారట.కానీ కోహ్లీ మాత్రం బీసీసీఐ చెప్పింది ఫాలో కాలేదని అంటున్నారు.

అసలు సన్మానాలతో జరిగేది ఏమీ ఉండదని కోహ్లీ అన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు