క్రికెట్లో టీమిండియా కు ఎన్నో అపురూప విజయాలను సాధించి పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ముందుగా చెప్పుకునే పేరు మహేంద్రసింగ్ ధోని.చివరిసారిగా 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు తో ఆడిన మ్యాచ్ లో కనిపించిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత కరోనా వైరస్ నేపథ్యంలో ఎటువంటి మ్యాచ్ ఆడకుండానే తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి అందరికీ తెలిసిందే.
కాకపోతే, మహేంద్ర సింగ్ ధోనీ లేని ఆటను అభిమానులు ఆస్వాదించలేకపోతున్నారు.టీమిండియా జట్టు ప్రతి అభిమానికి మహేంద్ర సింగ్ ధోనీ ఎంతగానో మిస్ అవుతున్నారు.
తాజాగా ఆస్ట్రేలియా దేశంలో జరుగుతున్న సిరీస్ లో భాగంగా మ్యాచ్ లను వీక్షించడానికి అభిమానులను అనుమతించింది క్రికెట్ ఆస్ట్రేలియా.ఇందులో భాగంగానే మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో కొందరు తాము ధోని మిస్ అవుతున్నామని బ్యానర్లను చూపిస్తూ ప్రదర్శనలు చేపట్టారు.అయితే ఇక్కడే ఓ మరపురాని సంఘటన జరిగింది.ధోని ని మిస్ అయ్యాము అన్న బ్యానర్ ప్రదర్శన సమయంలో దానిని విరాట్ కోహ్లీ చూస్తూ.
తాను కూడా ధోని మిస్ అవుతున్నా అంటూ చేత్తో సిగ్నల్స్ ద్వారా తెలియజేశాడు.

గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.అభిమానులు పట్టుకున్న ప్లేకర్డ్ చూసి మీరే కాదు.తాను కూడా ధోని ని మిస్ అయినట్లు చెప్పిన సైగలతో అభిమానులు కూడా మరింత ఆనంద పడ్డారు.
కోహ్లీకి ధోనీ అంటే ఎంతో అభిమానం అందరికీ తెలిసిందే.ఆ విషయాన్ని చాలాసార్లు ఆయన చెప్పుకొచ్చాడు.తాను కెప్టెన్ అయినాను అంటే అందులో ఎక్కువ భాగం ధోనీనే కారణమని కోహ్లీ చాలా సార్లు చెప్పాడు.తాజాగా కోహ్లీ కూడా మరోసారి ధోని మీద ఉన్న అభిమానాన్ని తన అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు.
ఇకపోతే ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యాచ్ ఆడనుంది.