ఏపీ సీఎం జగన్ ను కోడి కత్తి శ్రీను కుటుంబం కలవనుంది.ఈ మేరకు కోడి కత్తి శ్రీను ఫ్యామిలీకి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు.
దీంతో శ్రీను కుటుంబం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.అయితే, విశాఖ ఎయిర్ పోర్టులో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీను అనే వ్యక్తి కోడికత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో గత నాలుగేళ్లుగా శ్రీను రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తమ గోడును సీఎంకు చెప్పుకునేందుకు కుటుంబ సభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది.
తమ బిడ్డ బయటకు వచ్చేలా సీఎం చర్యలు తీసుకోవాలంటూ శ్రీను తల్లిదండ్రులు కోరుతున్నారు.కుటుంబానికి ఆధారమైన కుమారుడు జైలు పాలు కావడంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీనుకు బెయిల్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరనున్నారు.