జగన్ ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కొడాలి నాని

పవన్ కళ్యాణ్ జీవితంలో మమ్మల్ని ఓడించే లేడు అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు.పవన్ వ్యాఖ్యలపై గురువారం నాని స్పందిస్తూ నువ్వు సీఎం జగన్ ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.

నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకో అంటూ దెప్పిపొడిచారు.2024లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఘాటుగానే విమర్శించారు.నువ్వు.

చంద్రబాబు, బిజేపీ, కాంగ్రెస్ తో కలిసి రా చూసుకుందాం అంటూ నాని పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు.పవన్ కళ్యాణ్ ఏంటి మమ్మల్ని భయపెట్టిందంటూ.

ఇంకో జానీ సినిమా చూపించి భయ పెడతావా అని ఎద్దేవా చేశారు.పవన్ కళ్యాణ్ చూసి ఆయన అభిమానులు భయపడతారు.

పవన్ స్పీచ్ లకు జనం భయపడతారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు.

Advertisement

నీకేంటి భయపడేదన్నారు.చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ ను చదివి పవన్ కళ్యాణ్  మమ్మల్ని భయపెడతాడా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు