కొడాలి కౌంటర్ : వారంతా అమ్ముడుపోయిన గొర్రెలు  

  • ఇటీవల పాదయాత్ర చేసుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చారపురం భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ అనేక హామీలు… సంక్షేమ పథకాలు ప్రకటించారు. అయితే ఈ వీటిపై టీడీపీ కౌంటర్ కూడా వేసింది. ఈ మేరకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్యెల్యేలతో ఓ భారీ బహిరంగ లేఖ కూడా రాయించింది. ఈ లేఖలో వారు జగన్ మీద అనేక అనేక ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు గుడివాడ వైసీపీ ఎమ్యెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు.

  • Kodali Nani Is Angry To Tdp Mla's-

    Kodali Nani Is Angry To Tdp Mla's

  • వారంతా గొర్రెలు అంటూ మండిపడ్డారు. అంతే కాదు అసలు ఆ లేఖ రాసింది చంద్రబాబు అనికాకపోతే అందులో సంతకాలు చేసింది మాత్రం అమ్ముడుపోయిన గొర్రెలు అని నాని విమర్శించారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరిని సంతలో గొర్రెల్లా చంద్రబాబు కొనుగోలు చేశాడని, వారితో జగన్‌కు లేఖ రాయించాడని మండిపడ్డారు.