కుర్చీలో కూర్చునే మీ స్టైల్ మీరేమిటో ఇట్టే చెప్పేస్తుంది!

జాతకచక్రంలోని గ్రహాలు-రాశులు, హస్తరేఖలు, పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు మొదలైన వాటి ద్వారా వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తును తెలుసుకోవచ్చు.అదేవిధంగా మనిషి కూర్చునే, నడిచే విధానం చాలా విషయాలను చెబుతాయి.

 Know Your Personality By Your Sitting Posture ,  Sitting Posture , Planets Zodia-TeluguStop.com

ఇప్పుడు మనం ఒక వ్యక్తి కూర్చున్న విధానాన్ని అనుసరించి అతని స్వభావం, ప్రవర్తన గురించి తెలుసుకుందాం.ఇది బాడీ లాంగ్వేజ్‌లో కూడా భాగం.

కుర్చీపై కూర్చున్నప్పుడు మోకాళ్లను దగ్గరగా ఉంచుకునే వ్యక్తులు, వారి పాదాలను దూరంగా ఉంచుతారు.అలాంటి వారు బాధ్యతలు తీసుకోరు.

వీరు కష్టాలు వచ్చిన వెంటనే అక్కడి నుంచి పారిపోతారు.కుర్చీలో ఒక కాలిపై మరొక కాలు వేసుకుని కూర్చునే వారు సృజనాత్మకంగా వ్యవహరిస్తారు.

మర్యాదస్తులుగా మెలగుతారు.ఇటువంటివారు జీవితాన్ని స్వేచ్ఛగా ఆనందిస్తారు.

చేయడం సరికాదని భావించే పనులను వీరు ఎప్పుడూ చేయరు.కాగా కుర్చీపై కూర్చున్నప్పుడు పాదాలను దూరంగా ఉంచి, మోకాళ్లను దగ్గరగా ఉంచుకునే వారు హాయిగా జీవించడానికి ఇష్టపడతారు.

అయితే కష్టపడి పనిచేయడం అనేది వారికి అంతగా ఇష్టం ఉండదు.ఇలాంటివారు ఏకాగ్రతతో మెలగలేరు.

వారి మనస్సు చంచలంగా ఉంటుంది.కుర్చీపై కూర్చున్నప్పుడు మోకాలి నుంచి కిందికి కాళ్లను దగ్గరగా ఉంచేవారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు.

వీరు సమయపాలనతో పాటు ఆత్మపరిశీలన కలిగి ఉంటారు.ఇలాంటివారు నిరంతరం తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు.

వీరు బాధ్యతా రహితమైన ప్రవర్తనను సహించలేరు.రెండు పాదాలు అతికించి, ఒక పక్కగా కూర్చునే వారు మొండిగా ఉంటారు.

అయితే కూల్ గా ఉంటారు.తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube