ఒక గేదె చనిపోవడంతో ఆ ఊళ్ళో ఉన్న జనాలు అందరు ఆసుపత్రికి క్యూ కట్టి మరి వచ్చేసారు.ఆ గేదె మీద ప్రేమతో ఆసుపత్రికి వచ్చారనుకుంటున్నారా.? కాదండి బాబు ఆ గేదె వలన ఎక్కడ తమకు పిచ్చి పడుతుందో అనే భయంతో దాదాపు ఆ ఊరిలో ఉండే వెయ్యి మందికి పైగా జనాలు అక్కడ గల ఆసుపత్రికి బారులు తీసారు.ఏంటి ఇంత మంది జనాలు ఆసుపత్రికి బారులు తీసారని అక్కడ గల వైద్య సిబ్బంది వచ్చి అడగగా.
వాళ్ళు చెప్పిన సమాధానం విని అందరు షాక్ అయ్యారు.అసలు గేదె చనిపోతే వీళ్లకు పిచ్చి ఎందుకు వస్తుంది అని అయోమయంలో ఉన్నారా.!? అయితే అసలు విషయం మీకు తెలియలిసిందే.
నిజానికి ఆ గేదెను ఆ ఊరిలో ఉండే పిచ్చి కుక్క కరవడంతో ఆ గేదె చనిపోవడంతో అందరు కూడా బేంబేలెత్తిపోయారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలోని ఒక ఊరిలో జరిగింది.గేదె చనిపోవడానికి ముందు రోజు ఆ గేదె పాలతో తయారుచేసిన పదార్థాలను గ్రామంలో జరిగిన ఒక మతపరమైన వేడుకల్లో పంపిణీ చేయడం జరిగింది.
ఆ వేడుకకు గ్రామంలోని చాలామంది పాల్గొన్నారు.అలాగే మరికొందరు ఈ గేదె పాలనే ఇళ్లలో కూడా ఉపయోగించడం జరిగింది.ఆ తరువాత రోజునే ఆ గేదె పిచ్చి కుక్క కరవడంతో చనిపోయిందని తెలిసి ఆ గేదె పాలు తాగిన వారు అందరిలో భయం మొదలైంది.పిచ్చి కుక్క కరిస్తే భయంకరమైన రేబిస్ వ్యాధి వస్తుందని మనకు తెలిసిందే.
అందుకే కుక్క కరిసిన వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి రేబిస్ వాక్సిన్ వేయించుకుంటాము.అలాగే ఈ గేదె చనిపోవడంతో ఎక్కడా తమకు కూడా రేబిస్ వ్యాధి వస్తుందేమోనని భయంతో అందరూ కూడా ఆస్పత్రికి పరుగులు తీశారు.
జనాలు పెద్ద ఎత్తున హెల్త్ సెంటర్‌కు తరలివెళ్ళి రేబిస్ వాక్సిన్ వేయమని అడగడంతో అక్కడ ఆసుపత్రి సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారట.అయితే అంతమంది రేబిస్ వాక్సిన్ కోసం రావడంతో అక్కడ రేబీస్ టీకా నిల్వులు కొంతమందికి అయిపోయాయట.