వంటింటిలోని పప్పుల డబ్బాలలోకి పురుగులు ఎలా చేరతాయంటే..

పప్పులు పురుగుపట్టడాన్ని మీరు చూసే ఉంటారు.అయితే, అవి ఎక్కడి నుండి ఎలా వచ్చాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పప్పులో పురుగులు చేరడానికి కారణాలతో పాటు వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత తెరవని డబ్బాల్లోకి కూడా పురుగులు వస్తున్నాయని పలువురు వాపోతుంటారు.

వాస్తవానికి చాలాకాలం పాటు పప్పులను డబ్బాల్లో ఉంచినప్పుడు.అవి తేమకు గురయిన సందర్భంలో ఆ పప్పులకు పురుగులు పడతాయి.వర్షాకాలంలో పురుగుల భయం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే తేమ వర్షాకాలంలోనే అత్యధికంగా ఉంటుంది.వాస్తవానికి బ్యాక్టీరియా సంతానోత్పత్తి కూడా వర్షాకాలంలోనే జరుగుతుంది.

వాతావరణంలో తేమ, వేడి, ఆక్సిజన్ కలయిక కారణంగా, వాటిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.పప్పు దినుసులలో పురుగులు లేదా కీటకాలు రావడానికి ఇదే ప్రధాన కారణంం.

Advertisement

అంతే కాకుండా మూత సరిగ్గా పెట్టకపోవడం లేదా తడి చేతులను ఉపయోగించడం వల్ల కూడా పప్పు దినుసులకు పురుగులు పడతాయి.అందువల్ల, మీరు డబ్బాలలోని పప్పులను బయటకు తీసినప్పుడల్లా, మీ చేతులను బాగా శుభ్రం చేసుకోండి, స్వల్పంగా తేమవున్నా పురుగులు వృద్ధి చెందుతాయి.

పురుగుల నుండి పప్పుధాన్యాలను రక్షించడానికి ఉత్తమ మార్గం వాటి నిల్వలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

తేమ అనేది కంటైనర్ లోపలికి రాకూడదని గుర్తుంచుకోండి.తేమ లోపలికి వెళ్ళిన వెంటనే, బ్యాక్టీరియా ఏర్పడే ప్రక్రియ దానిలో ప్రారంభమవుతుంది.దానిని నివారించడానికి కొన్ని గృహ చిట్కాలు ప్రభావవంతంగా ఉంటాయి.

ఎండాకాలంలోనూ, వానాకాలంలోనూ వేప ఆకులను పప్పు డబ్బాలలో వేయాలి.బోరిక్ పౌడర్‌ను బియ్యం, గోధుమలు మొదలైన తృణధాన్యాలలో కాస్త జల్లాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పప్పులను ఫ్రిజ్‌లో ఉంచడం ద్వారా కూడా పురుగులను నివారించవచ్చు.

Advertisement

తాజా వార్తలు