ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఓకే.. ఆచార్య, సర్కారు వారి పాట పరిస్థితేంటి?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్.అయితే సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 What About Acharya And Sarkaru Vaari Paata Movies In Ap Acharya, Sarkaru Vaari-TeluguStop.com

కానీ ఈ సినిమా విడుదల తేదీ వరకు ఒక పరిస్థితి విడుదల తర్వాత ఏపీలో మరొక పరిస్థితి కనిపించబోతోంది.ఈ సినిమా విడుదల సమయానికి టికెట్ పై వంద రూపాయలు పెంచుకునే వెసులు బాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది.

థియేటర్లలో 120 రూపాయలు ఉన్న టికెట్ రేటు గరిష్టంగా 265 రూపాయలు ఉండబోతోంది.అయితే ఏపీ లో ఇదే పరిస్థితి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉంటుందా అంటే సమాధానాలు వినిపించడం లేదు.

నరేష్ అన్న విషయం పక్కన పెడితే ప్రొడక్షన్ కాస్ట్ వందకోట్లు దాటిన బడ్జెట్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఉంటాయి అని తెలిపింది.అయితే ఆ అనుమతులు ఎలా ఉంటాయి అన్నది ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు అందరికి ఒక క్లారిటీ రానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీ చిత్రాలు అయిన ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు విడుదల కానున్నాయి.

Telugu Acharya, Mahesh Babu, Rajamouli, Sarkaruvaari-Movie

మరి ఇవే అనుమతులు చిరంజీవి మహేష్ బాబు సినిమాలకు కూడా ఉంటాయా? లేకపోతే ఇలా పెద్ద సినిమాల విడుదలకు ముందు హీరోలు వెళ్లి ముఖ్యమంత్రి ని కలవడం అనుమతులు తెచ్చుకోవడం అన్నది పద్ధతి కాదు అని చెప్పవచ్చు.కాబట్టి దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడుదల చేస్తే అంత మంచిది.అయితే బెనిఫిట్ షోలపై ఇప్పటికే అనుమానాల్ని నివృత్తి చేసిన ప్రభుత్వం, పెయిడ్ ప్రివ్యూలపై కూడా నియమనిబంధనల్ని గైడ్ లైన్స్ లో పొందుపరిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

గైడ్ లైన్స్ వచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, థియేటర్ల నిర్వహణపై ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్దత, అనుమానాలకు తెరపడినట్టే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube