కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది.మలికిపురంలో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.
చిన్ని అనే వ్యక్తి ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో.
గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.కాగా బాధితులు నాని బాబు, మనోహార్ జోషిగా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కుటుంబ కలహాల కారణంగా దాడికి పాల్పడినట్లు సమాచారం.







