టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా విజయంపై వరుణుడు నీళ్లు జల్లాడు.వర్షం కారణంగా జింబాబ్వే – సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు అయింది.
హోబర్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు మొదటి నుంచీ వర్షం అడ్డుపడుతూనే ఉంది.మ్యాచ్ రెండు గంటల 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
దీంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు.దీంతో సౌతాఫ్రికా ముందు 80 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే నిర్దేశించింది.
మూడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది సౌతాఫ్రికా.విజయానికి చేరువగా 29 పరుగులు చేయాల్సి ఉండగా వరుణుడు మరోసారి తన ప్రభావాన్ని చూపాడు.
దీంతో మ్యాచ్ కు ఆటంకం ఏర్పడింది.మ్యాచ్ ను రద్దు చేసి రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.







