గవర్నమెంట్ ఆఫీసులో కత్తితో దాడి.. భయానక వీడియో వైరల్!

భూతగాదాలు ఇప్పటికే ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాయి.కాగా తాజాగా ఒక భూ తగాదంలో భాగంగా ఒక వ్యక్తి మరో వ్యక్తిని కట్టెలు నరకడానికి ఉపయోగించే కత్తితో దాడి చేశాడు.

 Knife Attack In Government Office  Scary Video Viral ,land Dispute, Machete Att-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కర్ణాటకలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం నాడు మద్దూరు తాలూకా కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ షాకింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ఆ దృశ్యాలలో ఎర్రచొక్కా ధరించిన ఒక వ్యక్తి కత్తితో మరొకరిని వెంబడిస్తూ కనిపించాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

దాడి చేసిన వ్యక్తిని నందన్‌గా గుర్తించగా, బాధితుడిని చెన్నరాజ్‌ (45)గా స్థానిక పోలీసులు గుర్తించారు.

భూ వివాదం కారణంగా చెన్నరాజుపై నందన్ దాడి చేశాడని పోలీసులు స్థానిక మీడియాకి వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, భూవివాదాన్ని పరిష్కరించేందుకు చెన్నరాజ్ మద్దూరు తాలూకా కార్యాలయానికి వెళ్లాడు.

అక్కడికి నందన్ కూడా వచ్చాడు.అయితే చెన్నరాజ్‌కు అనుకూలంగా నిర్ణయం రావడంతో ఆవేశానికి లోనైన నందన్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే బాధితుడి కళ్లలో కారం పొడి చల్లి కత్తి తీసి వెంబడించాడు.

అదృష్టవశాత్తూ, అతడి చేతిలో కత్తిని ముందుగానే చూసిన చెన్నరాజ్ ఆఫీసు ప్రవేశద్వారం వైపు పరిగెత్తాడు.ఈ గొడవ సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.అయితే మరొక వీడియోలో నందన్ ఆఫీస్‌ బయట చెన్నరాజ్‌ను వెంబడిస్తున్నట్లు కనిపించింది.ఆపై నందన్ అతనిని కొడవలితో పది కంటే ఎక్కువ సార్లు నరికాడు.దాంతో చెన్నరాజ్‌ నేలమీద పడిపోవడంతో స్థానికులు నందన్‌ను ఆపే ప్రయత్నం చేశారు.చివరికి నందన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఈ దాడిలో చెన్నరాజ్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం మండ్యలోని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు పోలీసులు నందన్‌ను అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube