జాగ్రత్త ప్రేమికులూ : లిప్ కిస్ వల్ల ప్రాణాలు పోతాయంట...

మానవ జీవితంలో "ముద్దు" అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే కొంతమంది ఈ ముద్దు ద్వారా తమకు ఇష్టమైన వారి మీద ఉండేటువంటి ప్రేమను చూపిస్తుంటారు.

అయితే తమ ప్రేమను వ్యక్తీకరించేందుకు పెట్టుకునే  ఈ ముద్దు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏకంగా మనుషుల ప్రాణాలు పోతాయని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఇటీవలే కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ ముద్దు అనే విషయంపై పలు పరిశోధనలు జరిపి "కిస్సింగ్ డిసీజ్" అనే వ్యాధిని కనుగొన్నారు.

అంతేగాక ఇటీవలే 17 సంవత్సరాలు కలిగినటువంటి ఓ బాలిక తన ప్రియుడిని గాఢంగా ముద్దు పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు నిరూపించారు.అయితే ఇందులో ముఖ్యంగా ఈ కిస్సింగ్ డిసీజ్ సోకిన వ్యక్తుల ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని అంతేగాక, ప్రవర్తనా తీరులో కూడా పెను మార్పులు చోటు చేసుకొని చివరికి మరణిస్తారని పేర్కొన్నారు.

అయితే ఈ కిస్సింగ్ డిసీజ్ ఎక్కువగా ఒకరినొకరు పెదవులపై ముద్దు పెట్టుకోవడం వల్ల తొందరగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

అంతేగాక అసలే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంటే ఇప్పుడు ఈ కిస్సింగ్ డిసీజ్ గురించి ప్రేమికులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.దాంతో కొంత మంది నెటిజన్లు తమ ప్రేమను వ్యక్త పరచడానికి కేవలం పెదవులపై మాత్రమే ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నుదుటి, బుగ్గలపై కూడా ముద్దు పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇలా చేస్తే కిస్సింగ్ డిసీజ్ నుంచి తప్పించుకోవడమే గాక తమపై ఇష్టమైన వారికున్న నమ్మకం కూడా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు