కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా చలామణి అవుతున్నారు.ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి నివాసంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేశారు.
అదే రీతిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలుకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అందే విధంగా వ్యవహరిస్తా అని స్పష్టం చేశారు.అంతమాత్రమే కాకుండా విభజన అంశాలకు సంబంధించి రెండుతెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమస్యలకి పరిష్కారం చూపుతా అంతమాత్రమే కాకుండా మోడీ ఎలాంటి శాఖ తనకు అప్పగించిన చిత్తశుద్ధితో పని చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అదే రీతిలో హైదరాబాద్ నగరానికికేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు కానుకగా ఇవ్వడం జరిగిందని తెలిపారు.దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉన్న టైంలో హైదరాబాద్ నగరంలో దాదాపు తొమ్మిది సార్ల ఆసుపత్రులు సందర్శించినట్లు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
క్యాబినెట్ మినిస్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఇంకా ఇదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం విషయంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంలో గాని లేదా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు అయినా గాని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడకపోతే ఖచ్చితంగా కేంద్రం ఎంటర్ అవుతుందని స్పష్టం చేశారు.
.