కిరణ్ అబ్బవరం సినిమాకి ఇంత తక్కువ కలక్షన్స్ వచ్చాయి ఏంటి..?

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయనకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.ఇక లాస్ట్ మంత్ రిలీజ్ అయిన వినరో భాగ్యం విష్ణు కథ( vinaro baghyamu vishnu katha ) సినిమా పెద్దగా ఆకట్టుకోక పోవడం తో కిరణ్ మీటర్ సినిమా మీదే తన అసలన్ని పెట్టుకున్నాడు ఇక దాంతో ఈ సినిమా రిలీజ్ అయి హిట్టు కొట్టడం పక్క అని కిరణ్ వెయ్యి కండ్లతో ఎదురుచూశారు ఇక తను అనుకున్నట్టు గానే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది.

 Kiran Abbavaram Movie Got So Low Collections, Kiran Abbavaram, Vinaro Baghyamu V-TeluguStop.com

మీటర్( meter ) సినిమాకి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వాళ్ళు కావడం తో ఈ సినిమా మీద మొదటి నుంచే సినీ ప్రేక్షకుల్లో కానీ సాధారణ అభిమానుల్లో కానీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇక దానికి తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకుంది… మొదట్లోనే మీటర్ సినిమా టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది.మీటర్ పాటలు, సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది.

దాంతో ఈ సినిమా విజయం సాధిస్తుందనే అంచనాకు ట్రేడ్ వర్గాలతో సినీ అభిమానులు కూడా వచ్చారు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది.

 Kiran Abbavaram Movie Got So Low Collections, Kiran Abbavaram, Vinaro Baghyamu V-TeluguStop.com

అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా ఎక్కువగానే అయినట్టు తెలుస్తోంది విజువల్స్ కూడా బాగా గ్రాండియర్ గా ఉన్నాయనే చెప్పాలి… ముందు అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అయింది.అయిన కూడా ప్రొడ్యూసర్స్ ఎక్కడ తగ్గకుండా క్వాలిటీ మిస్ కాకుడదనే ఉద్దేశంతో సినిమాను రిచ్‌గా రూపొందించాం అని చెప్పారు… ఈ సినిమాను మైత్రీ మూవీ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసింది.దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 4.5 కోట్లుగా అంచనా వేశారు.

Telugu Athulya Ravi, Kiran Abbavaram, Meter, Mythri Makers, Ramesh Koduri, Vinar

మీటర్ థియేటర్ కౌంట్.: మీటర్ సినిమా థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.ప్రపంచవ్యాప్తంగా 460 స్క్రీన్లలో రిలీజ్ అయింది.నైజాంలో 90 స్క్రీన్లు, సీడెడ్‌లో 40 స్క్రీన్లు, ఆంధ్రాలో 150 స్క్రీన్లలో ప్రదర్శించారు.ఆంధ్రా, నైజాంలో మొత్తం 280 స్క్రీన్లకుపైగా ప్రదర్శించారు.ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి 180 స్క్రీన్లలో ప్రదర్శించారు.

అయితే మీటర్ సినిమాకు తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.సినీ విమర్శకులు ఈ సినిమాపై పెదవి విరిచారు.

మార్నింగ్ షోలకు 15 శాతం, మ్యాట్నికి 10 శాతం, ఫస్ట్ షోకు 11 శాతం, సెకండ్ షోకు 10 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.ఓవరాల్‌గా తొలి రోజు 12 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.

Telugu Athulya Ravi, Kiran Abbavaram, Meter, Mythri Makers, Ramesh Koduri, Vinar

మీటర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.ఓవర్సీస్‌లో చిత్రానికి పెద్దగా స్పందన కనిపించలేదు.ప్రీమియర్లకు 20 లోకేషన్లలో 27 షోల ద్వారా 170 డాలర్లు, తొలి రోజు 55 లొకేషన్లలో 104 షోల ద్వారా 2 వేల డాలర్లు వసూలు చేసింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 1 కోటి రూపాయలు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మీటర్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది.థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే.ప్రపంచవ్యాప్తంగా కనీసం 4.5 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎందుకంటే.గత సినిమాలతో పోల్చుకొంటే మీటర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా కలెక్షన్స్ ని రాబట్టింది.అయితే హిట్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ మాత్రం తక్కువగానే వస్తున్నాయి…ఇక కిరణ్ అబ్బవరం కెరియర్ రోజు రోజుకీ గాడి తప్పుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube