ఎస్ఆర్ కల్యాణ మండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే.
ఈ సినిమాలో చాందినీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది.గోపినాథ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పలు షాకింగ్ కామెంట్లు చేశాడు.
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు.అయితే తన సినిమాలో ఫుల్ లవ్ ఉంటుందని చెప్పాడు.
టూ మచ్ లవ్ ని బాగా ఎంజాయ్ చేస్తారని వివరించాడు.
అయితే కాంట్రవర్సీలకు ఏమాత్రం తావు లేదని… కాంట్రవర్సీ అంటే తాను రెండు అడుగుల దూరంలో ఉంటానని తెలిపారు కిరణ్ అబ్బవరం.
ఇవన్నీ వదిలేసి మీ లవర్స్ తో కలిసి సినిమాకి రండి.చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని సూచించాడు.అయితే జూన్ 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు.అంతే కాదండోయ్… 15వ తేదీన ట్రైలర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 20న కానీ, 22న కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అభిమానులకు గిఫ్టుగా ఇచ్చాడు.
అలాగే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.సెబాస్టియన్ 524 పీసీ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.మరి ఇప్పుడు రాబోతున్న సమ్మతమే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా బాక్సాఫీసు వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుందో తెలియాలంటే ఈ నెలవ తేదీ వరకు ఆగాల్సిందే.