ప్రముఖ సినిమా నిర్మాతగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు చూపు ఇప్పుడు రాజకీయాలపై పడింది.ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి, ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో దిల్ రాజు ఉన్నారు.
అది కూడా అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన ఆశ పడుతున్నారు.ఆయన 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు.
తనకు టిక్కెట్ కేటాయించాల్సిందిగా కోరుతూ సీఎం కేసీఆర్ తో ఆయన అప్పట్లో భేటీ అయ్యారు.అయితే ఎన్నికల సర్వే లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, దిల్ రాజుకు టిక్కెట్ దక్కలేదు.
అయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఎంపీగా పోటీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు.
ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ గా బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ గెలిచారు.ఇక్కడి నుంచే కేసీఆర్ కుమార్తె ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 2019 ఎన్నికల్లో అరవింద్ పై పోటీ చేసి ఓటమి చెందారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతారా అనేది క్లారిటీ లేదు.అయినా ఈ సీటు కోసమే దిల్రాజు ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో కెసిఆర్ ఈసారైనా ఆయనకు టికెట్ కేటాయిస్తారా ? నిజామాబాద్ లో కనుక టికెట్ కేటాయించే అవకాశం లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి దిల్ రాజుకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చూస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా ఐ ప్యాక్ టీమ్ సర్వేలు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ సర్వే నివేదిక ఆధారంగా ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న అభ్యర్థులకే టికెట్ కేటాయించే అవకాశం ఉంది.దిల్ రాజు ఆశపడుతున్నట్టు గా నిజామాబాద్ నుంచి కానీ, వేరే ప్రాంతం నుంచి కాని ఆయనకు టిట్ దక్కాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పేరు ఉండాల్సిందే.ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నిజామాబాద్ ప్రాంతంలో ప్రజలకు చేరువయ్యేందుకు ఎక్కువగా పర్యటన చేస్తున్నారు.
అంతేకాదు నిజామాబాద్ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి స్థానికులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.







