ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) మంచి మంచి సక్సెస్ లో అందుకుంటూ ఒక గుర్తింపుతో ముందుకు దూసుకుపోతున్నాడు.ఈమధ్య ఈయన క్రేజ్ బాగా పెరిగిపోతుంది.
చేసేవి చిన్న సినిమాలైనప్పటికీ కూడా ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు.ఇక తాజాగా ఆయన మీటర్ సినిమాలో( Meter Movie ) నటించగా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాతో రమేష్ కాదూరి నూతన దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఇందులో కిరణ్ అబ్బవరం సరసన అతుల్య రవి( Atulya Ravi ) హీరోయిన్ గా నటించింది.
అంతేకాకుండా సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది.
ఇక ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
వెంకట్ సి దిలీప్, సురేష్ సారంగం చాయ గ్రహణం అందించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
చాలావరకు ట్రైలర్ చూసి భారీ అంచనాలు కూడా పెంచుకున్నారు.ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అలాగే కిరణ్ అబ్బవరం కు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే ఇందులో కిరణ్ అబ్బవరం అర్జున్ కళ్యాణ్ పాత్రలో కనిపిస్తాడు.ఇక అర్జున్ కళ్యాణ్ తండ్రి పోలీస్ ఆఫీసర్.ఆయన చాలా నిజాయితీపరుడు.కానిస్టేబుల్ గా పనిచేస్తూ నిజాయితీగా ఉండటం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు.ఇక ఎలాగైనా తన కొడుకు అర్జున్ కళ్యాణ్ ని ఎస్సై చేయాలన్నది తన కోరిక.కానీ అర్జున్ కు మాత్రం పోలీస్ అవడం అస్సలు ఇష్టం ఉండదు.
కానీ అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అవుతాడు.ఇక డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడమే ఆలస్యం ఎప్పుడు డిస్మిస్ అవ్వాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు.
అయితే ఓసారి అనుకోకుండా హోమ్ మినిస్టర్ కంఠం బైరెడ్డి (పవన్) తో అర్జున్ కళ్యాణ్ కి క్లాష్ వస్తుంది.ఇక అధికారంలోకి రావడానికి బైరెడ్డి ఒక స్కాం కూడా చేస్తాడు.
మరి అదేంటి.దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రభావాలు ఎదుర్కొంటుంది.
చివరికి అర్జున్ ఏం చేస్తాడు అన్నది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
కిరణ్ అబ్బవరం అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు.తన పాత్రలో మంచి ఎనర్జీ చూపించాడు.ఇక హీరోయిన్ అతుల్య రవి కూడా పర్వాలేదు అన్నట్లుగా నటించింది.
పవన్ నెగిటివ్ పాత్రలో బాగా అద్భుతంగా నటించాడు.ఇక మిగతా నటి నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు కొత్త కథలను ఆశిస్తున్నారు.ఇటువంటి కథలు చాలావరకు రొటీన్ గా అనిపించడం వల్ల ప్రేక్షకులు కొత్త కథలపై ఆసక్తి చూపిస్తున్నారు.
సాయి కార్తీక్ అందించిన సంగీతం ఆకట్టుకోలేకపోయింది.సినిమాటోగ్రఫీ పరవాలేదు అన్నట్లుగా ఉంది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పని చేశాయి.
విశ్లేషణ:
ఇక సినిమాలో కొత్తదనం అనేది లేకుండా పోయింది.చాలావరకు రొటీన్ గా అనిపించింది.మాస్ కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చినప్పటికీ కూడా అందులో కొత్తదనాన్ని చూస్తున్నారు.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం నటన, మాస్ సన్నివేశాలు, కొన్ని డైలాగులు.
మైనస్ పాయింట్స్:
సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.కొన్ని సన్నివేశాలు ఊహించితగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్:
ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా అందర్నీ రీచ్ అవుతుంది అనేది చాలా తక్కువ అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో మాస్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ను అంతగా రీచ్ అవ్వలేదు అన్నట్లు తెలుస్తుంది.