తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ(Krishnavamsi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన కృష్ణవంశీ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ(Rangamarthanda) అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా గత నెల విడుదలై థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఏ విధమైనటువంటి పబ్లిసిటీ ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) రమ్యకృష్ణ(Ramyakrishna) బ్రహ్మానందం నటన అద్భుతమని చెప్పాలి.తన కామెడీ డైలాగులతో అందరిని ఎంతగానో నవ్వించే బ్రహ్మానందం ఈ సినిమాలో తన నటన వల్ల అందరి చేత కంటతడి పెట్టించారని చెప్పాలి.ఇలా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరాఠీ నట సామ్రాట్ (Nata Samrat) అనే సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కింది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో దర్శకుడుగా కృష్ణవంశీ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు.ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ఏ మాత్రం చడి చప్పుడు లేకుండా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సమస్థ అమెజాన్(Amazon) వారు కైవసం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.అయితే ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన సినిమా గురించి ప్రమోషన్స్ కూడా చేయకుండా ఈ సినిమాని చాలా సైలెంట్ గా ఓటీటీలో విడుదల చేశారు.ఈ సినిమా నేటినుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
థియేటర్లో సక్సెస్ అయినటువంటి ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.







