కరీంనగర్ జిల్లాలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.చిన్నారులను మహారాష్ట్రలోని జాల్నా నుంచి నగరానికి తీసుకువచ్చారు.
కరీంనగర్ లో ఇద్దరు పిల్లలను జయశ్రీ అనే మహిళ కిడ్నాప్ చేసింది.అనంతరం వారిని తీసుకుని మహారాష్ట్రలోని జాల్నాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
రైల్వే ప్లాట్ ఫారంపై చిన్నారులను కొట్టింది.దీంతో అనుమానం వచ్చిన జాల్నా పోలీసులు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు అధికారులు సమచారం అందించగా.మహారాష్ట్రకు వెళ్లి పిల్లలను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు.