ఓ యువకుడి కిడ్నాప్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశారు ఇంతలోనే ఆ యువకుడిని చంపేశారు.అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరం లో యువకుడి కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
బుధవారం పోతవరం సమీపంలోని సుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తుతేలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని 50 లక్షలు ఇస్తే విడిచి పెడతామని డిమాండ్ చేశారు.దీంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మా అబ్బాయికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇంతలోనే కిడ్నాప్ అయినా యువకుడి షుగర్ ఫ్యాక్టరీ వద్ద శవమై తేలాడు.
యువకున్ని డబ్బు కోసమే హత్య చేశారా.!? లేక ఇంకేమనా కుటుంబ తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.